ఇస్మార్ట్ శంకర్ ఆడితే `ఆటోజానీ` ఉంటుందా??
on May 21, 2019
చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన సెలక్ట్ చేసుకున్న దర్శకుడు డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమాకు ఆటోజానీ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. రౌడీ అల్లుడులో బాగా ఫేమస్ అయిన ఈ క్యారెక్టర్ నే తీసుకుని టైటిల్ పెట్టేసాడు పూరీ. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని అప్పట్లో చెప్పాడు పూరీ. ఈ చిత్రం చర్చలు 2016లో జరిగాయి. అయితే ఆ తర్వాత అనుకోని కారణాలతో ఆటోజానీ అటకెక్కేసింది.
ఆ తర్వాత చిరంజీవి కానీ, పూరీ కానీ ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడలేదు. ఫస్టాఫ్ వరకు కథ అద్భుతంగా సెట్ అయినా సెకాండాఫ్ సెట్ కాకపోవడంతో చిరంజీవి ఆటోజానీ నుంచి తప్పుకున్నాడు.ఈ విషయాన్ని అప్పట్లో అన్నయ్యే నేరుగా మీడియాకు చెప్పాడు.ఈ విషయంలో పూరీ కూడా కాస్త హర్ట్ అయ్యాడు. చిరంజీవి గారు నాతో నేరుగా చెప్పుంటే బాగుండేదని కాస్త నొచ్చుకున్నాడు కూడా. అయితే అప్పుడు మరిచిపోయిన సినిమాను ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కించడానికి పూరీ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది.
అన్నీ కుదిర్తే కథలో కాస్త మార్పులు చేసి రామ్ చరణ్ ను ఆటోజానీగా మార్చేయాలని చూస్తున్నాడు ఈ డేరింగ్ డైరెక్టర్. మెగా వారసున్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిందే పూరీ జగన్నాథ్. చిరుత సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. దాన్ని ఆయనే డైరెక్ట్ చేసాడు. దాంతో పూరీతో సినిమా అంటే చరణ్ కూడా నో అనే సమస్య లేదు.
అయితే ఏది ఒకే చేయాలన్నా కూడా ముందు పూరీ జగన్నాథ్ ఒక్క హిట్ కొట్టాలి. ప్రస్తుతం ఈయన రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇది కానీ హిట్ అయిందంటే మళ్లీ పూరీకి మంచి రోజులు వచ్చినట్లే. అప్పుడు ఆటోజానీకి కూడా మంచి రోజులు వస్తాయి. మరి చూడాలిక ఏం జరగబోతుందో తండ్రి కాదన్న సినిమాలో తనయుడు నటిస్తాడో లేదో అనేది ఇప్పుడు ఆసక్తీకరంగా మారింది.