బ్యాడ్ డైరక్టర్ తో సుధీర్ బాబు!!!
on May 16, 2019
హెడ్డింగ్ చూసి మరోలా అనుకోకండి. ఆర్టిస్ట్ గా, రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్ `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాతో డైరక్టర్ గా మారాడు. కాకుంటే ఆ సినిమా పలు కారణాల వల్ల రిలీజ్ ఆగిపోయింది. అయితే ఈ డైరక్టర్ ప్రజంట్ ఒక మంచి కథ సిద్ధం చేసుకుని మరో సినిమా డైరక్ట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అవును సుధీర్ బాబు కు ఇటీవల స్టోరి వినిపించాడట హర్ష వర్థన్. స్టోరి విపరీతంగా నచ్చిన సుధీర్ బాబు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను సుధీర్ బాబు తన సొంత బేనర్ లోనే నిర్మించనున్నాడట. `నన్ను దోచుకుందువటే` సినిమాను తన బేనర్ లో నిర్మించి సక్సెస్ అందుకున్న సుధీర్ ఈ సినిమాను కూడా తన బేనర్ లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావొచ్చాయట. జూన్ ఆఖరులో కానీ, జూలై లో కానీ షూటింగ్ ప్రారంభించనున్నట్లు వినికిడి. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు దిల్ రాజు బేనర్ లో ఇంద్రగంటి దర్శకత్వంలో నానితో కలిసి `వి` సినిమాలో నటిస్తున్నాడు.