సంక్రాంతికి మాస్ రాజా!!
on Apr 24, 2019
డ్యూయల్ రోల్ లో మాస్ మహరాజా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా `డిస్కో రాజా`. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకరావడనికి ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే క్రేజ్ నెలకొంది. ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకునని నెక్ట్స్ షెడ్యూల్ మే మూడో వారంలో జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండటంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి దానిపై దృష్టి సారించనున్నాడట దర్శకుడు. ఇందులో రవితేజ్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.
ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. గతంలో సంక్రాంతి సీజనకు వచ్చిన కృష్ణ, మిరపకాయ్ చిత్రాలు హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో `డిస్కో రాజా` చిత్రాన్ని కూడ సంక్రాతికి తీసుకరానున్నారు. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చూద్దాం మళ్లీ ఈ సినిమాతో మాస్ రాజా మరోసారి సక్సెస్ అందుకుంటాడో లేదో.