'దర్బార్'కు వెళ్ళిన నయనతార!!
on Apr 23, 2019
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బేనర్ లో `దర్బార్` చిత్రం రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతోన్న ఈ సినిమాలో తెలుగు, తమిళ చిత్రాల బిజీ హీరోయిన్ అందాల తార నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దర్బార్ మూవీ లో రజనీ కాంత్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ప్రజంట్ ఈ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ రోజు నుండి నయనతార షూటింగ్ లో పాల్గొంటోంది. నయనతార, రజనీకాంత్ లపై ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.