English | Telugu

సప్తగిరి సినిమాలో చైనీస్ పాట!

on Apr 16, 2019

 

తెలుగు సినిమాల్లో హిందీ పాటలను విన్నాం! పవన్ కల్యాణ్ 'ఖుషీ'లో 'యే మే రాజాహా...'కి ముందు, తర్వాత చాలా తెలుగు సినిమాల్లో హిందీ పాటలు పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... తెలుగు సినిమాలో చైనీస్ పాటను తెలుగు ప్రేక్షకులు వినబోతున్నారు‌. ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి కథానాయకుడిగా నటించిన సినిమా 'వజ్రకవచధర గోవింద'. అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఒక చైనీస్ పాట ఉంది. ఒక చైనీస్ సంగీత దర్శకుని సంప్రదించి... ఆల్రెడీ అతను కంపోజ్ చేసిన సాంగ్ రైట్స్ తీసుకుని 'వజ్రకవచధర గోవింద'లో ఉపయోగించారు. ఈ పాట ప్రేక్షకులను బాగా నవ్విస్తుందని సప్తగిరి చెప్పారు. ఈ రోజు మీడియా మిత్రులకు పాటను చూపించారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ "లవర్స్ సినిమాలో నేను పిచ్చి పట్టిన వాడిగా నటిస్తే... ప్రేక్షకులు పడి పడి నవ్వారు. అంతకుమించి నవ్వించే చిత్రమిది. 'ప్రేమ కథా చిత్రమ్', 'లవర్స్', 'ఎక్స్ ప్రెస్ రాజా' చిత్రాల్లో నా కామెడీ సీన్స్ కి యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ఉంటాయి. మళ్లీ మిలియన్ వ్యూస్ వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో కుదిరాయి. నేను హీరోగా నటించిన 'సప్తగిరి ఎక్స్ ప్రెస్', 'సప్తగిరి ఎల్ ఎల్ బి' రీమేక్ సినిమాలు. ఈ 'వజ్రకవచధర గోవింద' స్ట్రయిట్ సినిమా. హీరోగా నటించిన రెండు సినిమాల్లో ఎమోషన్ వర్కౌట్ అయింది. ఈ సినిమాలో మాత్రం ఎమోషన్ కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. హీరోలా కాకుండా కమెడియన్ లా సినిమా చేశా" అన్నారు. చైనీస్ పాట మాత్రమే కాదు... సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయట.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here