English | Telugu

వెంకీకి నితిన్ హ్యాండ్ ఇచ్చాడా?

on Mar 22, 2019

 

క్వశ్చన్ మార్కు అవసరం లేదేమో... వెంకీకి నితిన్ హ్యాండ్ ఇచ్చినట్టే అనుకోవాలేమో! ఇక్కడ వెంకీ అంటే హీరో వెంకటేష్ కాదు. నాగశౌర్య హీరోగా నటించిన 'ఛలో'తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల. నితిన్ కోసం ఆల్మోస్ట్ ఏడాది నుంచి వెయిట్ చేస్తున్నాడీ దర్శకుడు. 'భీష్మ' స్క్రిప్ట్ రెడీ చేసి కూర్చున్నాడు. 'ఛలో'తో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందన్న ఈ సినిమా చేస్తున్నట్టు ట్విట్టర్లో చెప్పింది కూడా. అయితే... నితిన్ ఈ సినిమాను పక్కనపెట్టి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు హోలీ రోజు నితిన్ ట్వీట్ చేశాడు. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలవుతుందని, భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తారని నితిన్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ కంటే ముందు రమేష్ వర్మ దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయనున్నట్టు ప్రెస్ నోట్ వచ్చింది. దాని గురించి మాత్రం హీరో నుంచి ఎలాంటి ట్వీట్, క్లారిటీ లేదు. రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా ఉంటుందా? లేదా? అనేది పక్కన పెడితే... చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సినిమా పక్కా. అంటే... వెంకీ కుడుములకు హ్యాండ్ ఇచ్చినట్టే కదా!


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here