ఎన్నారైగా అనుష్క!!
on Feb 21, 2019
అనుష్క తన తదుపరి సినిమా కోసం జీరో సైజుకు వచ్చేసింది. ఈ ఫొటోస్ ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. `భాగమతి` తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె హేమంత్ మధుకర్ డైరక్షన్ లో ఓ సినిమాలో నటించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా ఫారెన్ లో చేయడానికి ప్లాన్ చేశారు. ఇక అనుష్క ఈ చిత్రంలో ఎన్నారై గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి ` సైలెన్స్` అనే టైటిల్ ని ఖరారు చేసిన సంగతి కూడా తెలిసిందే. మాధవన్, సుబ్బరాజ్ తో పాటు షాలిని పాండే, అంజలి ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోన ఫిలిం కార్పోరేషన్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో కూడా విడుదలకానుంది. గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.