తమన్నాకు దేశభక్తి ఎక్కువేనట!
on Feb 19, 2019
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపుని ఏర్పరుచుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా కూడా...తట్టుకొని సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు దూసుకెళ్తోంది. ఈ సంక్రాంతి కి విడుదలైన `ఎఫ్ 2` చిత్రం బ్లాక్ బస్టర్ తో మళ్లీ హిట్ లిస్ట్ లోకి చేరిపోయింది. ప్రస్తుతం దటీజ్ మహాలక్ష్మి, సైరా చిత్రాలలో నటిస్తూ బిజీ బిజీ గా ఉంది. ఇక తమన్నా సైరా చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పోషించే పాత్ర కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తెలుగు తొలి ఫ్రీడమ్ ఫైటరైన `ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి` లైఫ్ హిస్టరీ బేస్ చేసుకుని `సైరా` నరసింహా రెడ్డి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నర్తకి లక్ష్మి అనే డీ గ్లామర్ క్యారక్టర్ చేస్తోందట తమన్నా. తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ సినిమాలో కీలకమైన పాత్ర తమన్నాదట. దేశభక్తి భావాలు మెండుగా ఉండే పాత్రనట. ఈ పాత్ర వల్లే ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం మలుపు తీసుకుంటుందట. డాన్స్ లు చేయడంలో తమన్నా దిట్ట. ఇక క్లాసికల్ డాన్స్ గా కూడా ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకోనుంది. ఈ చిత్రం దసరాకు విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.