మహేష్‌కు టైటిల్‌ని `వాట్సప్` చేసిన డైరక్టర్!!
on Feb 19, 2019
`పటాస్,సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాలు వరుస సక్సెస్ లు కావడంతో మాంచి ఊపు మీదున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తను డైరక్ట్ చేస్తోన్న సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ని తను అనుసరిస్తున్నాడట. ఇప్పటికి నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి తన ఒక్క పటాస్ మినహా తన మూడు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టి సక్సెస్ కొట్టాడు. అయితే ఈ టాలెంటెడ్ డైరక్టర్ తన తదుపరి సినిమాకు కూడా ఓ ఇంగ్లీష్ టైటిల్ ను ఫిలించాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఒక సారి వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఇటీవల సూపర్ స్టార్ మహేష్ కు అనిల్ రావిపూడి ఓ స్టోరి చెప్పి నట్లు త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకోసమే అనిల్ రావిపూడి `వాట్సప్` అనే ట్రెండీ టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. వరుసగా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టి సక్సెస్ కొడుతోన్న అనిల్ దాన్ని కొనసాగిస్తూ మరోసారి తన సినిమాకు సెంటిమెంట్ గా ఇంగ్లీష్ టైటిల్ రిజిస్టర్ పెట్టాడని అంటున్నారు సిని జనం. మరి మహేష్ , అనిల్ సినిమా విషయంలో క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటర వెలువడే వరకు వెయిట్ చేయక తప్పదు.
Also Read