`వెంకీ మామ`తో పాయల్ రాజ్ పుత్!!
on Feb 18, 2019
`ఆర్ ఎక్స్ 100` చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది ఉత్తరాది భామ పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం మాస్ మహరాజా రవితేజకు జోడిగా `డిస్కోరాజా` లో నటిస్తోంది. ఆమెకు ఇప్పుడు వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి. ఇప్పటికే రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఓకే చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే `మన్మథుడు-2` చిత్రంలో నాగార్జున సరసన ఇద్దరిలో ఒక హీరోయిన్ గా నటించనుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే వరుసలో పాయల్ రాజ్ పుత్ మరో సీనియర్ హీరో తో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు...తాజాగా ఎఫ్ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ తో `వెంకీమామ` చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిందట. వెంకీ మేనల్లుడు చైతు, వెంకీ కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇప్పటికే చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాను ఈనెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేలంగి గ్రామంలో 15 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. వెంకటేష్ ఈ చిత్రంలో రైస్ మిల్ ఓనర్ గా నటించనున్నాడని టాక్. బాబి దర్శకత్వం వహిస్తోన్న ఈచిత్రం దసరా కానుకగా విడుదల చేయనున్నారు.
Also Read