కావాల్సినంత కాంట్రవర్సీతో ` లక్ష్మీస్ ఎన్టీఆర్ `
on Feb 14, 2019
ఎన్టీఆర్ లైఫ్ హిస్టరీ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ పెద్ద కాంట్రవర్సీకే తెర తసీనట్లు కనిపిస్తోంది. రోజుకో పోస్ట్ తో , వెన్నుపోటు పాటతో సంచలనం సృష్టించిన వర్మ ట్రైలర్ తో కావాల్సినంత కాంట్రవర్సీని సృష్టించినట్లు అర్థమవుతోంది. రామా రామా అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ లో ` జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో...ఎవరికీ అర్థం కాదు...`` అంటూ ` ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి నా జీవిత చరిత్ర రాస్తున్నారు..`` అంటూ లక్ష్మీ పార్వతిని తన పార్టీ సభ్యులకు పరిచయం చేసే సన్నివేశాలను చూపించారు.
వెంటనే `` దానికి కొడుకు పుడితే మీ ఫ్యామిలీ ఫినీష్ `` అంటూ చంద్రబాబు ...ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో అనడం...` ఈ వయసులుఓ కూడా మీకు ఆడతోడు అవసరమా `` అంటూ హరికృష్ణ...ఎన్టీఆర్ ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే దానికి ఎన్టీఆర్ సీరియస్ కావడం వంటివి ఆసక్తికరంగా చూపించాడు వర్మ. `తమ్ముళ్లూ వాడి మాట వినకండి అంటూ ఎన్టీఆర్ చంద్రబాబు ని ఉద్దేశించి పార్టీ సభ్యులకు చెబితే వారు మాత్రం ఎన్టీఆర్ పై చెప్పులు విసరడం...ఫైనల్గా నా మొత్తం జీవితంలో చేసిన ఒకే తప్పు ...వాడిని నేను నమ్మడం అంటూ చంద్రబాబుని ఉద్దేశించి చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. మరి ఈ ట్రైలర్ ని చూసి తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. మొత్తానికైతే ఈ ట్రైలర్ తో కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ చేసాడు అంటున్నారు సినీ పండితులు.