దిల్రాజు ఇంట పెళ్లి భాజాలు
on Dec 15, 2018
ప్రముఖ నిర్మాత దిల్రాజు ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లనున్నారు. ఆయన సంస్థలో పని చేసిన యువ హీరోలు పలువురికి గోవా రమ్మని ఆహ్వానాలు అందాయి. ఎందుకు? అంటే... దిల్ రాజు అన్న కొడుకు హర్షిత్ పెళ్లి ఈ నెల (డిసెంబర్) 21న గోవాలో జరగనుంది. అదీ సంగతి!! కొన్ని రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదోని ఎమ్మెల్యే సాయిప్రకాష్ రెడ్డి కుమార్తెతో హర్షిత్ రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగింది. గోవాలో పెళ్లి ప్లాన్ చేశారు. ఈ పెళ్ళికి హీరోలు నాని, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్.. దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ వేణు శ్రీరామ్ తదితరులు హాజరు కానున్నారట. హైదరాబాద్లో ఈ నెల 23న జరిగే రిసెప్షన్ కి ఇండస్ట్రీ ప్రముఖులు అంతా హాజరు అవుతారట.