పోర్న్ సైట్స్ లాగే పైరసీ సైట్స్ బ్యాన్ చేయాలిః విజయ్ దేవరకొండ
on Nov 15, 2018
అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. తను నటించిన తాజా చిత్రం `టాక్సీవాలా`. జిఎ2 పిక్చర్స్ , యువి క్రియేషన్స్ పతాకాలపై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్ కేయన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు మీడియాతో మాట్లాడాడు విజయ్ దేవరకొండ. ఆ విశేషాలు...
`గీత గోవిందం` కూడా పైరసీ అయింది కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది...పైరసీ ప్రభావం పెద్దగా పడలేదన్నట్టే కదా?
అయితే అన్ని సందర్బాల్లో అలా జరగాలని లేదు కదా. పైరసీ వల్ల మా సినిమాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఆడియన్స్ సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారా? లేదా అన్న టెన్షన్ అయితే ఉంటుందిగా. పెళ్లి చూపులు సినిమా పైరసీ జరగి ఉంటే నాకు ఆ తర్వాత సినిమాలు వచ్చి ఉండేవి కావు. నేను ఇంత దూరం వచ్చి ఉండేవాన్ని కూడా కాదు. ఏమైనా పైరసీని బ్యాన్ చేయాలి. పోర్న్ సైట్స్ లాగే పైరసీని బ్యాన్ చేయాలి.
మీ సినిమాలే పైరసీ అవుతున్నాయి...కావాలనే ఎవరైనా చేస్తున్నారంటారా?
ఎవరో కావాలని నా సినిమాలు పైరసీ చేస్తున్నారనీ అయితే మాత్రం నేను అనుకోవడం లేదు. పైరసీ అనేది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో టీమ్ లో ఉన్న వ్యక్తులే చేయడానికి అవకాశం ఉంటుంఇ. `గీత గోవిందం` కూడా అలాగే పైరసీ అయింది. ఏమైనా ఒక సినిమా పైరసీ చేస్తే ఆ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరి లైఫ్ తో ఆడుకున్నట్లే.దీని వల్ల చాలా టెన్షన్ కి , ప్రెజర్ కి గురి అవుతున్నాం.
ఇక మీదట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు?
ఎవరో పైరసీ చేస్తున్నారో తెలిస్తే వారి మీద ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరు చేస్తున్నారో తెలియదు కదా. చాలా పైరసీ సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాటిని బ్యాన్ చేస్తే సరిపోతుంది.
టాక్సీవాలా సినిమా విషయంలో చాలా అంచనాలున్నాయి...అందుకుంటాననుకుంటున్నారా?
నేను అంచానలు అనేవి పెద్దగా నమ్మను. ఎవరైనా సినిమా బాగుందంటేనే చూస్తారు. లేదంటే ఎవ్వరు చూడరు. నేను అదే నమ్ముతాను. కానీ చాలా మంది నాతో కూడా అంటుంటారు నీ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయనీ...నేను వాటిని అంత సీరియస్ గా తీసుకోను.
నోటా మూవీ రిజల్ట్స్ ముందే ఊహించారా?
రిలీజ్ కు ముందు రోజే చూసాను. కొన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నాయనిపించింది కానీ అప్పుడు ఏం చేయలేం కదా...
టాక్సీవాలా రీ షూట్స్ ఏమైనా చేసారా?
పెళ్లి చూపులు తర్వాత ఒప్పుకున్న సినిమా `టాక్సీవాలా`. ఈ కథ విన్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. స్టోరీ విన్నతంసేపూ నవ్వుతూనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే చెబుతున్నా సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చే సినిమా.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బన్నీ మిమ్మల్ని బాగా పొగిడేశాడు...ఎలా అనిపించింది?
వాటిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నా. బన్నీ గారు, చిరంజీవిగారు నా గురించి మాట్లాడటం అనేది వాళ్ల గొప్పతనం. అంత గొప్ప స్టార్స్ నా గురించి మాట్లాడటం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.
కొత్త డైరక్టర్స్ తో కాకుండా పెద్ద డైరక్టర్స్ తో సినిమా చేస్తే మార్కెంట్ ఇంకా పెరుగుతుంది కదా?
ఆ విధంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. కథ నచ్చితే సినిమా చేస్తున్నా అంతే. అయితే వచ్చే ఏడాది మాత్రం ఒక పెద్ద డైరక్టర్ తో సినిమా కచ్చితంగా ఉంటుంది. నేను ఆయనకు పెద్ద అభిమానిని ఆయన సినిమా చేద్దాం అని అడగటం ఎప్పటికీ మర్చిపోలేను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం డియర్ కామెడీ నడుస్తోంది. ఈ మంత్ ఎండింగ్ నుంచి మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. 30శాతం షూటింగ్ పూర్తయింది. నెక్ట్స్ ఇయర్ మిడిల్ లో సినిమా రిలీజ్ ఉంటుందంటూ ఇంటర్వ్యూ ముగించారు క్రేజీ హీరో.