ఆ సెంటిమెంట్ టాక్సీవాలాకు కలిసోస్తుందా!!
on Nov 15, 2018
చాలా ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమని పైరసీ భూతం వెంటాడుతోన్న విషయం తెలిసిందే. గతంలో సినిమాలు విడుదలయ్యాక పైరసీకి గురయ్యేవి కానీ ప్రస్తుతం సినిమాలు విడుదల కాకముందే హెచ్ డి క్వాలిటీతో ప్రింట్లు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. అయితే ఇలా లీకైన సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయన్న సెంటిమెంట్ కూడా బలంగా తెలుగు ఇండస్ట్రీలో నాటుకుపోయింది. ఇందుకు సాక్ష్యాలే పవన్ కళ్యాన్ నటించిన `అత్తారింటికి దారేది` చిత్రం. ఈ సినిమా రిలీజుకు ముందు సగానికి పైగా రిలీజైంది. అయినా కానీ రిలీయ్ అయ్యాక బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇటీవల కాలంలో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన `గీత గోవిందం` చిత్రం కూడా రిలీజ్ కు ముందు పైరసీ అయింది. సినిమాలో హైలెట్స్ అనుకన్న సీన్స్ లీకయ్యాయి. కట్ చేస్తే సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్ల క్లబ్ లో చేరింది. విజయ్ దేవరకొండ స్ఠాయిని ఓ లెవల్ కు తీసుకెళ్లింది. అయితే ఈ నెల 17న విడుదల కానున్న విజయ్ దేవరకొండ నటించిన `టాక్సీవాలా` కూడా కొన్ని నెలల ముందే పైరసీ కి గురైంది. నిర్మాతలు ముందే మేల్కోని సైబర్ వారిని అలర్ట్ చేయడంతో సినిమా పబ్లిక్ లోకి వెళ్లకుండా ఆపగలిగారు. అయితే గోతగోవిందం లీకైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కోవలో `టాక్సీవాలా` కూడా లీకైంది కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కవుటవుతూ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా? అన్నది సినిమా వాళ్ల చర్చ. ఒకవేళ సినిమా పెద్ద హిట్టయిందంటే మరక మంచిదే అన్నట్టు లీక్ కూడా మంచిదే అంటారేమో!!
Also Read