రీమేక్నే నమ్ముకున్న దర్శకుడు!!
on Nov 15, 2018
ఇటీవల కాలంలో హరిష్ శంకర్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. దిల్ రాజు బేనర్ లో ఒక సినిమా ఉందంటూ వార్తలు వచ్చినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. పవన్ కళ్యాణ్ తో `దబాంగ్` సినిమాను తెలుగలో `గబ్బర్ సింగ్` గా రీమేక్ చేసి స్టార్ దర్శకుల్లో చేరిపోయిన ఈ దర్శకుడు మరోసారి రీమేక్ నే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే... కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ `జిగర్తాండ్రా` చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడట దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ తీసుకుని తెలుగు కి తగ్గట్టుగా స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కార్తిక్ సుబ్బరాజ్ రూపొందించిన ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈచిత్రాన్ని 14 రీల్స్ నిర్మించనుందట. త్వరలో నటీనటుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. చూద్దాం ఈ రీమేక్ తో అయినా హరీష్ గట్టుక్కుతాడేమో!!