మహేష్ ని చాలా వెనక్కి తీసుకెళ్తోన్న సుక్కు!!
on Oct 20, 2018
రంగస్థలంతో రామ్ చరణ్‌ని 1980 లోకి తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ...అదే ఫార్ములాతో మహేష్ ని 1930 లోకి తీసుకెళ్తున్నాడు . రంగస్థలం తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ లో మహేష్ , సుక్కు కాంబినేషన్ లో సినిమా ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం 1930 బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియాడికల్ స్టోరీని సిద్ధం చేశాడట సుక్కు. మహేష్ ఇప్పటి వరకు పీరియాడికల్ ఫిల్మ్స్ లో నటించలేదు. అందుకే ఓసారి ట్రై చేద్దామన్నట్లుగా ఉన్నాడట మహేష్. అందుకే సకుమార్ ఆ నేపథ్యంలో కథను సిద్దం చేశాడట. ప్రస్తుతం మహేష్ `మహర్షి` సినిమా షూటింగ్ కోసం న్యూయార్క్ వెళ్లాడు. అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక సుక్కు స్టోరీని మహేష్ కు నేరేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకే అయితే వెంటనే మిగతా పనులు ప్రారంభించాలన్న ఆలోచనలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఉ న్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వన్ నేనొక్కడినే చిత్రం వచ్చినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈసారైనా ఈ కాంబోలో వచ్చే సినిమా తో హిట్ కొట్టాలన్న కసితో సుక్కు స్ట్రిప్టు రెడీ చేశాడని తెలుస్తోంది.