ఆ క్రేజీ హీరో దూకుడు `టాక్సీవాలా`పెంచుతుందా!!
on Oct 20, 2018
మూడే మూడు సినిమాలతో ఓ రేంజ్ హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. వరుసగా సక్సెస్ లు కొడుతూ...తన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఈ క్రేజీ హీరో. గీత గోవిందం చిత్రం వంద కోట్లు పై చిలుకు సాధించి విజయ్ కు పట్ట పగ్గాలు లేకుండా చేసింది. దీనితో విజయ్ కూడా ప్రెస్ మీట్స్ లలో , ఇంటర్వ్యూ లలో చెలరేగిపోయాడు. ఈ వేగాన్ని ఒక్కసారిగా `నోటా` సినిమా వచ్చి మాట రాకుండా చేసింది. ఎంతో హైప్ ని తీసుకొచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో విజయ్ స్పీడ్ కి కాస్త బ్రేకు లు పడ్డట్లైంది. ఇదిలా ఉంటే ఎప్పుడో రావాల్సిన `టాక్సీవాలా` చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.
నవంబర్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా టాక్సీవాలా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ఇంటర్వ్యూస్ లో విజయ్ మాట్లాడుతూ `టాక్సీవాలా` ఎప్పుడొచ్చినా పెద్ద హిట్టవుతుంది. దాని మీద నాకు చాలా కాన్ఫిడెంట్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ నమ్మకాన్ని, ఈ స్పీడ్ ని టాక్సీవాలా పెంచుతుదా? ఇంకా తగ్గిస్తుందా? అన్నది తెలియాలంటే నవంబర్ 16 వరకు వెయిట్ చేయాల్సిందే.