రామ్ చరణ్ నిర్మాతగా ఎన్టీఆర్ సినిమా..!!
on Sep 22, 2018
ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. అదే విధంగా రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాల అనంతరం ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నారు.. అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాకుండానే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో మరో సినిమా అంటూ వార్తలు మొదలయ్యాయి.. అయితే అది మల్టీ స్టారర్ కాదు.. ఎన్టీఆర్ హీరో, రామ్ చరణ్ నిర్మాత.. ఈమధ్య రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ ను స్థాపించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే తండ్రి మెగాస్టార్ చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' సినిమాను నిర్మించి హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం 'సైరా' సినిమాని నిర్మిస్తున్నాడు.. అయితే ఈ సినిమా అనంతరం నిర్మాతగా మూడో సినిమాను ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఎన్టీఆర్ కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం.. మరి చరణ్ నిర్మాతగా ఎన్టీఆర్ సినిమా ఉంటుందా?.. ఒకవేళ ఉంటే దర్శకుడు ఎవరు? ఇలాంటివి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.