మహేష్ బావ సంపాదించింది ఏం లేదట!!!
on Sep 20, 2018
నిజానికి నేను ఎప్పుడో నిర్మాతను అయిపోయాను. నా తొలి సినిమాలో నేను కూడా కొంత ఇన్వెస్ట్ చేశాను. నేను ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు చేసినా...నేను సంపాదించింది అంటూ ఏమీలేదు. కొన్ని సినిమాలు ఫ్రీగా చేశాను. మరి కొన్ని సినిమాలు తక్కువ రెమ్యూనిరేషన్ కే చేశాను అన్నారు సుధీర్ బాబు. ఆయన నటిస్తూ నిర్మించిన `నన్నుదోచుకుందువటే ` చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ...`` నాకు ఇంత సపోర్ట్ ఉన్నా నేనే సినిమా ఇండస్ట్రీలో మొదట్లో చాలా తిరస్కరణలు ఎదుర్కొన్నా...అలాంటిది ఎటువంటి సపోర్ట్ పరిస్థితి ఏంటని బేనర్ స్థాపించి కొత్త వారిని , కొత్త కాన్సెప్ట్స్ తో వచ్చే వారికి అవకాశాలు కల్పిస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నాను.
అలాగే నేను సినిమాలు చేసిన నిర్మాతలు కొంత మంది వారికి సరిగా అవగాహన లేకపోవడంతో సరిగా సినిమాలు తీయలేదు. పబ్లిసిటీ కూడా సరిగా చేసే వారు కాదు. ఇది కూడా నిర్మాతగా మారడానికి ఒక కారణం అని చెప్పవచ్చు అంటున్నాడు. `` ప్రస్తుతం బయట బేనర్స్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాను. ఇక వరుసగా నా బేనర్ లో సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో లీడ్ రోల్ చేస్తున్నా`` అన్నారు. తొలి సినిమా నిర్మాతగా , హీరోగా మంచి పేరు తెస్తుందన్న ఆశాభావంతో ఉన్నాడు సుధీర్ బాబు.