అరవింద సమేత టీజర్ రికార్డులు
on Aug 16, 2018
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'అరవింద సమేత' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసారు.. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఎన్టీఆర్ చేసిన అదిరిపోయే యాక్షన్ సీన్తో టీజర్ స్టార్ట్ అవుతుంది.. బ్యాక్ గ్రౌండ్లో జగపతి బాబు వాయిస్ ఓవర్ వినిపిస్తుంది.. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా?.. మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా?.. మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?.. అంటూ జగపతి బాబు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
ఇక 'కంటబడ్డావా కనికరిస్తానేమో.. ఎంటబడ్డనా నరికేస్తాఓబా' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. ఆది, సింహాద్రి సినిమాలను తలదన్నే సినిమా అవుతుందని సంబరపడుతున్నారు.. మరోవైపు ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.. ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ టీజర్, ఫాస్టెస్ట్ 50 k, 150 k లైక్స్ సాధించిన తెలుగు టీజర్ గా నిలిచింది.. అలాగే ఇప్పటికే 300 k లైక్స్ తో తెలుగు టీజర్స్ లో ఆల్ టైం లైక్స్ రికార్డును బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతుంది.. గతంలో ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమాకి సంబంధించిన జై టీజర్ 20 మిలియన్ వ్యూస్ తో తెలుగులో హైయెస్ట్ వ్యూస్ సాధించిన టీజర్ గా నిలిచింది.. మరి ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ సాధించిన అరవింద సమేత టీజర్ జై టీజర్ రికార్డుని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.