లిప్ లాక్కి నితిన్ ఓకే చెప్తాడా?
on Jul 20, 2018
ఆర్ ఎక్స్ 100 ' తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. దర్శకుడిగా తొలి సినిమాలో రొమాంటిక్ సీన్లను హ్యాండిల్ చేసిన తన టాలెంట్ ని అందరూ అభినందిస్తున్నారు.అసభ్యత లేకుండా బోల్డ్ సీన్లను ప్రెజెంట్ చేసి తెరపై చూపించిన అజయ్ భూపతి కి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం తన రెండవ సినిమా హీరో నితిన్ తో చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి ప్రముఖ నిర్మాత,నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తో సంప్రదింపులు జరిపాడని, దీనికి సుధాకర్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను యూత్‌ను టార్గెట్ చేసే సినిమాలు చేస్తానని, ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించే డ్రామాలు చేయబోనని అజయ్ భూపతి తెలపటంతో రెండవ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు,లిప్ లాక్ లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం.ఇంతవరకు హీరో నితిన్ ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది లేదు.మరి ఇందుకు నితిన్ ఒప్పుకుంటాడా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం నితిన్ దిల్ రాజు బేనర్లో తెరకెక్కుతున్న శ్రీనివాస కళ్యాణం మూవీ లో బిజీ గా ఉన్నాడు.శతమానం భవతి లాంటి హిట్ చిత్రాన్ని అందించిన సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.