నాగార్జున, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్
on Jun 25, 2018
సీనియర్ హీరోలు నాగార్జున,వెంకటేష్ యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు.. మహేష్ బాబుతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తో అలరించిన వెంకటేష్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఒకటి, అలానే నాగ చైతన్యతో ఒక మల్టీస్టారర్ చేస్తున్నాడు.. ఇక నాగార్జున కూడా కార్తీతో కలిసి చేసిన 'ఊపిరి' సినిమాతో ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు.. అయితే ఇప్పుడొక ఆసక్తిరమైన వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.. నాగార్జున త్వరలో నందమూరి కళ్యాణ్ రామ్ తో కూడా ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడట.. ఈ సినిమాకి 'ప్రేమ ఇష్క్ కాదల్' ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది.. నాగార్జున, కళ్యాణ్ రామ్ ఇద్దరికీ కథ నచ్చడంతో పవన్ స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడట.. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది.