రానా కోసం బాధపడుతున్న శ్రీరెడ్డి
on Jun 21, 2018
టాలీవుడ్ కండల వీరుడు దగ్గుబాటి రానా తన కంటి ఆపరేషన్‌కు రెడీ అవుతున్నాడు. వైవిధ్యంతో సినిమాలు చేస్తూ తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన రానా ప్రస్తుతం ఓ పీరియాడిక్ జానర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఎప్పటినుండో తన కుడి కన్నుతో ఇబ్బంది పడుతున్న రానా ఆ కన్నుకి ఆపరేషన్ చేయించుకోడానికి సిద్ధమవుతున్నారు. కాగా... ఇటీవలే కాస్టింగ్ కౌచ్ అంటూ పాపులర్ అయిన శ్రీరెడ్డి మీకు గుర్తుంది కదూ. వుంటుందిలే ఎందుకంటే ఆమె కాస్టింగ్ కౌచ్‌తో టార్గెట్ చేసింది సినిమా ఇండట్రీలోనే బాడా బాబుల్ని. చివరకు సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌తో వున్న ఫోటోలను మీడియాకి ఇచ్చింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడు పోస్టులు పెట్టినా సురేష్ పేరు ప్రస్తావించాల్సి వస్తే ‘మామ’ అని... రానాను ‘బావగారు’గా సంబోధిస్తూనే ఉండేది. కానీ శ్రీరెడ్డి పెట్టిన రీసెంట్ పోస్టులో మాత్రం రానాను మొదటిసారి రానా‘సర్’ అంటూ చాలా మర్యాదపూర్వకంగా సంబోధించింది. అంతే కాకుండా రానా కంటి సమస్యతో బాధపడుతున్నాడని తెలిసి నేను చాలా బాధపడాను. ఆపరేషన్‌కు రెడీ అవుతున్న రానా ‘సర్’ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను అంటూ పోస్టు పెట్టింది.