బిగ్ బాస్-2 నుండి నాని ఔట్?
on Jun 19, 2018
బిగ్ బాస్.. గత ఏడాది తెలుగు పేక్షకులకు పరిచయమైన రియాలిటీ షో.. తారక్ హోస్ట్ గా బిగ్ బాస్ షో అనౌన్స్ చేయగానే.. తారక్ ఏంటి? హోస్ట్ ఏంటి? ఎలా చేస్తాడు? హోస్ట్ గా మెప్పిస్తాడా? ఇలా ప్రేక్షకులకు ప్రశ్నల మీద ప్రశ్నలు తలెత్తాయి.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తారక్ బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పేసాడు.. తారక్ తన అల్లరి, యాక్టీవ్ నెస్, టైమింగ్ తో ప్రేక్షకులని ఫిదా చేసాడు.. అసలు బిగ్ బాస్ సీజన్ 1 సక్సెస్ అవ్వడానికి తారక్ కారణం అనడంలో అతిశయోక్తి లేదు.. హోస్ట్ గా తారక్ అంతలా మెప్పించాడు.. దాంతో ప్రేక్షకులు బిగ్ బాస్ -2 ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసారు.. కానీ ఇంతలో ఓ వార్త బయటికొచ్చింది, సీజన్ 2 కి తారక్ హోస్ట్ గా చేయట్లేదని.. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.. తరువాత హోస్ట్ నాని అని తెలిసింది.
నాని పక్కింటి కుర్రాడిలా ఉంటాడు కాబట్టి నాని కూడా హోస్ట్ గా మెప్పిస్తాడు అనుకున్నారు.. బిగ్ బాస్ -2 ప్రారంభమైంది.. ఫస్ట్ ఎపిసోడ్ నాని అంతగా ఆకట్టుకోలేదు.. ప్రేక్షకులు ఈ సీజన్ కూడా తారక్ అయితేనే బాగుండేది అనుకోవడం మొదలుపెట్టారు, మరోవైపు చిన్న ఆశ నాని నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఆకట్టుకుంటాడేమో అని.. ఫస్ట్ వీకెండ్ కూడా నాని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.. ఇక ప్రేక్షకుల్లో నాని మీద ఆశ పోయింది, బిగ్ బాస్ మీద అసహనం పెరిగింది.. బిగ్ బాస్ 2 పట్ల ప్రేక్షకులు అసహనంగా ఉండటంతో బిగ్ బాస్ నిర్వాకులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.
నాని తరువాతి ఎపిసోడ్స్ లో కూడా మెప్పించకపోతే, అవసరమైతే నాని ప్లేస్ లో వేరొకరిని హోస్ట్ గా తీసుకురావాలని చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.. దీంతో ప్రేక్షకుల్లో తారక్ వస్తాడా ? లేక వేరే ఎవరైనా వస్తారా? అని ప్రశ్నలు మొదలయ్యాయి.. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలీదు కానీ అవార్డు ఫంక్షన్స్, ఈవెంట్స్ లో హోస్ట్ గా అదరగొట్టే నాని, ఫాములోకి వచ్చి బిగ్ బాస్ లో కూడా అదరగొట్టాలని ఆశిద్దాం.