ఎన్టీఆర్ ఎంట్రీ.. ఫ్యాన్స్ హ్యాపీ
on Jun 14, 2018
ఫ్యాన్స్ తమ అభిమాన హీరో గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆశపడుతుంటారు.. సోషల్ మీడియా పుణ్యమా అని ఆ ఆశ ఆనందంగా మారుతుంది.. సోషల్ మీడియా హీరోని, ఫ్యాన్స్ ని మరింత దగ్గర చేస్తుంది.. ఇప్పుడు తారక్ కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి మరింత దగ్గరవుతున్నాడు.. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ తో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉన్న తారక్ ఇంస్టాగ్రామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.. తారక్ ఎంట్రీతో హ్యాపీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ ఇంస్టాలో తారక్ ని చకచకా ఫాలో అవ్వడం మొదలు పెట్టేసారు.