హారర్ సినిమాలో అంజలి
on May 22, 2018
అచ్చ తెలుగు అమ్మాయి అంజలి తెలుగు సినిమాల్లో మాత్రం అరుదుగానే కనిపిస్తూ ఉంటుంది. తెలుగులో చేసిన చిత్రాలకంటే తమిళంలో చేసిన చిత్రాలకే అంజలి ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు మరోసారి టాలీవుడ్లో అడుగుపెట్టే ప్రయత్నంలో ఉంది. అది కూడా ఓ హారర్ మూవీతో! అంజలి ముఖ్యపాత్రగా వచ్చిన గీతాంజలి సినిమా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. బహుశా అందుకేనేమో మరోసారి అదే జోనర్లో తెలుగు ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తోంది. లీసా అనే హారర్సినిమాలో టైటిల్ పాత్రతో ముందుకు రానున్నట్లు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఈ చిత్రం అటు తమిళ, తెలుగు భాషల్లో రూపొందనుంది. పనిలో పనిగా లీసా ఫస్ట్ లుక్‌ని కూడా తన ట్విట్టర్లో అతికించేసింది అంజలి.