కష్టాల్లో దీపికా పదుకొనే..
on May 21, 2018
ఒకప్పుడు ఆమె కేవలం గ్లామరస్ డాల్. ఆమె తొలి చిత్రం ఓం శాంతి ఓంలోనే డబుల్ రోల్ ప్లే చేసినా... నటిగా ఓ మాదిరి గుర్తింపు మాత్రమే వచ్చింది. కానీ ఒకో అడుగే వేసుకుంటే, బాలీవుడ్ ఆల్ టైమ్ హీరోయిన్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. అటు హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టగలిగింది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు దీపిక కెరీర్ కాస్త అటూఇటూగా ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాలు హిట్టయినా... ఆమె భారీ రెమ్యూనరేషన్‌కి భయపడి నిర్మాతలెవ్వరూ ముందుకు రావడం లేదట. దాంతో ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.