సన్నీలియోన్ ‘వీరమహాదేవి’ సిద్ధం
on May 19, 2018
పోర్న్ స్టార్ సన్నీలియోన్ దక్షిణాదికి చిత్రాలకి కొత్త కాకపోవచ్చు. కానీ ఇప్పటివరకూ ఐటం సాంగ్స్‌కే పరిమితం అయిన సన్నీ లియోన్ ఇప్పుడు ఓ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఇందులో తను వీరమహాదేవి అనే రాణిగా నటించడం మరో చిత్రం. తమిళ్లో నిర్మితం అవుతున్న ఈ సినిమా... తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల అవ్వడం విశేషం. వి.సి. వడివుడయాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా విడుదల కావడంతో ప్రేక్షకులలో ఆసక్తి మొదలైపోయింది. మరి ఈ చిత్రం వివాదాలే రేపుతుందో, వినోదమే అందిస్తుందో చూడాలి!