ఎన్టీఆర్ బయోపిక్ కి వాస్తు ఇబ్బందులు
on May 5, 2018
టాలీవుడ్ లో స్టార్ హీరోల దగ్గరి నుండి దర్శక, నిర్మాతల వరకు సెంటిమెంట్స్ ని నమ్ముతారు. ఒకవేళ, ఒక హీరోయిన్ సినిమా ప్లాప్ అయితే ఆమెతో పనిచేయడానికి ఎవరూ ఇష్టపడరు. అలాగే ఏదయినా సెంటిమెంటల్ గా వర్క్ అవుట్ అయితే, నెక్స్ట్ సినిమాల్లో కూడా రిపీట్ చేస్తారు. ఇక అసలు విషయానికి వస్తే, హీరో నందమూరి బాలకృష్ణ వాస్తు, జ్యోతిష్యం ని విపరీతంగా నమ్ముతారు. ఏ పని మొదలు పెట్టినా, పురోహితుల్ని సంప్రదించకుండా చేయరు అని అంటారు. ప్రస్తుతం, తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రని సినిమా గా తీద్దాం అనుకుంటున్న బాలకృష్ణకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సినిమా ఆఫీస్ వాస్తు బాలేకపోవడం వల్లే ఇన్ని సమస్యలు అని భావించిన బాలకృష్ణ వాస్తు నిపుణుల్ని పిలిపించి ఆఫీస్ పరిశీలించామని పురమాయించారట. బాలకృష్ణ డౌట్స్ నిజమే అని, ఆఫీస్ కి వాస్తు దోషం ఉంది అని నిర్ధారించారట. సో, బాలకృష్ణ ప్రస్తుతం వేరే ఆఫీస్ వెదికే పని తన టీం కి అప్పగించారట. ఏది ఏమయినా, ఈ సారి వాస్తు బాగున్న ఇల్లు మాత్రమే చూడాలని ఖచ్చితంగా చెప్పారట. తన తండ్రి ఎన్టీఆర్ క్యారెక్టర్ చేయడంతో పాటు, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా బాలకృష్ణ చేబడుతున్న విషయం మనకు తెలిసిందే!