మహేష్ కి, రాజమౌళి కి ఎందుకు చెడింది?
on Mar 21, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒక సినిమాకు కలిసి పని చేస్తారు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో షూట్ చేసి, ఇతర భాషల్లో అనువదిస్తారు అని ప్రచారం జరిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టిస్టారర్ తర్వాత రాజమౌళి ఈ మూవీ ని స్టార్ట్ చేస్తాడు అని అన్నారు. అయితే, ఎందుకో తెలియదు కానీ రాజమౌళి కి మహేష్ బాబు కి మధ్య చెడింది అంటూ కొత్తగా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. రంగస్థలం పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ట్వీట్లు వేస్తున్న జక్కన్న, భరత్ అనే నేను సినిమా గురించి మౌనం వహిస్తున్నారు. అసలు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భరత్ అనే నేను గురించి రాజమౌళి ఇంతవరకు ఒక్క సారి కూడా రెస్పాండ్ అవ్వ లేదు. అయితే, కొందరు మాత్రం రాజమౌళి కి మహేష్ బాబు మధ్య అంతా బానే ఉందని... మహేష్ బాబు సినిమా పై ట్రైలర్ రిలీజ్ తర్వాత మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా, మహేష్ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే, 2019 చివరలో మహేష్, రాజమౌళి సినిమా మొదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.