పవన్ కు నాకూ గొడవ నిజమే.. అది ఆమె వల్లే...!
on Mar 19, 2018
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అలీకి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే పవన్ ప్రతి సినిమాలో అలీ ఉండాల్సిందే. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. గత కొద్దిరోజులుగా పవన్ కు అలీకి మధ్య మనస్పర్థలు వచ్చాయని... అందుకనే ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా అలీ లేడని గుసగుసలు వినిపించాయి. ఆ తరువాత ఈ వార్తలపై స్పందించిన అలీ..తనకు పవన్ కల్యాణ్ కు ఎలాంటి మనస్పర్థలు రాలేదని, బిజీ షెడ్యల్ కారణంగానే తాను ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించలేకపోయాని ఎన్నోసార్లు వివరణ ఇచ్చారు. కానీ వార్తలు మాత్రం ఆగలేదు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్న అలీని అడుగగా... చిర్రెత్తుకొచ్చిన అలీ... ’పవన్ కల్యాణ్ హీరో కాకముందు నుంచే మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆయన తొలి సినిమాలో నేను చేయలేదు. అలాగే ‘అజ్ఞాతవాసి’లోనూ చేయలేదు. మిగిలిన అన్నీ సినిమాల్లో నేను ఉన్నప్పటికీ మా ఇద్దరి మధ్య గొడవైందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవునండీ నిజమే మా ఇద్దరికీ గొడవైంది .. అదీ ‘ఇవాంకా ట్రంప్’ వల్ల.‘ అంటూ నవ్వేశారు. గుంటూరులో జరిగిన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా పవన్ కల్యాన్ నన్ను పిలిచారని, తాను కూడా వెళ్లానని.. ఎన్నిసార్లు చెప్పాలని అన్నారు.