English | Telugu

మెగాఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న‌చిరు కామెంట్స్‌!!

on Mar 19, 2018


అవును.. రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో చిరంజీవి మాట‌లు మెగా అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రంగ‌స్థ‌లం వేడుక‌లో చిరు చేసిన కామెంట్స్ ఆ సినిమాపై ఉన్న న‌మ్మ‌కాన్ని, అంచ‌నాల్ని కాస్త కింద‌కు దించే ప్ర‌య‌త్నం చేశాయ‌న్న‌ది ఇప్పుడు బ‌లంగా వినిపిస్తున్న‌మాట‌. `ఈ సినిమాకు అవార్డులు రావ‌డం ఖాయం.. జాతీయ అవార్డు కూడా వ‌స్తుంది. రాక‌పోతే ఈ సినిమాకి అన్యాయం జ‌రిగిన‌ట్టు` అంటూ చిరంజీవి ఆవేశ ప‌డ్డాడు.  జ‌నం చ‌ప్ప‌ట్లు కొట్టారు, వేదిక‌మీద ఉన్న‌వాళ్లంతా పుల‌కించిపోయారు. కాక‌పోతే.. అవార్డు సినిమా అంటే బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసుల వ‌సూళ్లు కుర‌వ‌వు అనే ఓ న‌మ్మ‌కం బ‌లంగా ఉంది. పైగా జాతీయ అవార్డులు సాధించుకున్న సినిమాల‌న్నీ.. దాదాపుగా ఆర్ట్ చిత్రాలే. అంటే... రంగ స్థ‌లం కూడా ఆ బాప‌తు సినిమా అని చిరంజీవి ప‌రోక్షంగా చెప్పిన‌ట్టే క‌దా?  అంత‌టితో ఆగ‌లేదు.. క్లైమాక్స్ చూసి ఏడ్చేశాన‌ని, తాను కంట్రోల్‌లో ఉన్నా భార్య సురేఖ మాత్రం చ‌ర‌ణ్‌ని ప‌ట్టుకుని గుక్క‌ప‌ట్టి మ‌రీ ఏడ్చింద‌ని చెప్పుకొచ్చాడు చిరు. చ‌ర‌ణ్ లోని న‌ట‌న చూసి చిరు అలా పుల‌కించి ఉండొచ్చు. కాక‌పోతే.. హెవీ క్లైమాక్స్‌లు థియేట‌ర్లో చూడ‌డం క‌ష్టం. `ఇదో ఏడుపుగొట్టు సినిమా` అనే ముద్ర వేస్తే.. జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డ‌తారు. అంతేకాదు.. హెవీ క్లైమాక్స్ సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఆడిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. ఇలా.. చిరు కామెంట్స్‌తో ఈ సినిమా ఎలా ఉండ‌బోతోందో అని కాస్త గంద‌ర‌గోళంలో ప‌డ్డారు అభిమానులు.  అటు డ‌బ్బులు, ఇటు అవార్డులూ వ‌స్తే ఫ‌ర్వాలేదు. చిరు చెప్పిన‌ట్టు ఈ సినిమా అవార్డుల‌కే ప‌రిమిత‌మైతే మాత్రం.. చ‌ర‌ణ్ అండ్ కో మెగా అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టే.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here