నాకు ప్రభాస్ తో గొడవా... నో ఛాన్స్...
on Mar 15, 2018
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఇండస్ట్రీ లో చాలా మంచి పేరు ఉంది. ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉంటాడని... వివాదాలకు దూరంగా ఉంటాడని... విమర్శకులు సైతం ప్రేమించే వ్యక్తిత్వం ప్రభాస్ సొంతం అని కొనియాడుతారు. అలాంటి ప్రభాస్ తన డైరెక్టర్ తో గొడవ పడ్డాడని వార్తలు వస్తున్నాయి. సాహో చిత్ర దర్శకుడు సుజీత్ తో ప్రభాస్ కి కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చాయని... షూటింగ్ డిలే అవ్వడానికి అదే ప్రధాన కారణమని గాసిప్స్ వినిపించాయి. అయితే, ఇవన్నీ అబద్ధాలని కొట్టిపడేసాడు డైరెక్టర్ సుజీత్. తనకు, ప్రభాస్ కి మధ్య అంతా బానే ఉందని... మీడియా లో తప్పుడు ప్రచారం జరుగుతుందని... షూట్ లో జాప్యానికి కారణాలు వేరే అని వివరించారు. దుబాయ్ లో షూట్ కి పర్మిషన్ రాకపోవడమే సినిమా నత్త నడకన సాగడానికి కారణం అని చెబుతున్నారు. అయితే, ఈ సీన్లన్నీ హైదరాబాద్ లో సెట్లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదట, సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకున్నా, ఇప్పుడు షూటింగ్ లో జాప్యం కారణంగా 2019 సమ్మర్ కి పోస్టుపోన్ చేసారు. ఈ మధ్యలో ప్రభాస్ జిల్ దర్శకుడు రాధాకృష్ణ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సంక్రాంతి విడుదల చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.