డైరెక్టర్ ని నమ్ముకుంటే సాహోకి కష్టాలే...
on Mar 12, 2018
ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే చాలు.. అసలు సినిమా ఆ తరువాత మొదలవుతుంది. ఇక సినిమా హీరోపై, డైరెక్టర్ పై మామూలు ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు. ఇప్పుడు ఆ ఎక్స్ పెక్టేషన్సే ఓ డైరెక్టర్ కు చక్కలు చూపిస్తున్నాయట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. రన్ రాజా రన్ సినిమాతో హిట్ ను అందుకున్న సుజిత్. సుజిత్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో సినిమా చేస్తున్నాడు. ఇక బాహుబలి తరువాత ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో మాత్రమే వినిపించే ప్రభాస్ పేరు..బాహుబలి తరువాత.. దేశం మొత్తం వినిపిస్తుంది. మరి అలాంటి ప్రభాస్ తో సినిమా.. దానికి తగ్గట్టు యువీ క్రియేషన్స్... 150 కోట్ల భారీ బడ్జెట్. ఇక ఇన్ని స్పెషాల్టీస్ ఉంటే అంచనాలు పెంచుకోవడం కామనే కదా.. ఆ అంచనాలే ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ పై విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాయట. అంతేకాదు సుజిత్ పై చిత్ర యూనిట్ కు డౌట్లు కూడా వస్తున్నాయట.
ఎందుకంటే.. రన్ రాజా రన్ ఫన్ మిక్స్ డ్ థ్రిల్లర్.. సాహో హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టెయినర్.. దీంతో సాహోను ఎంతవరకు తీర్చిదిద్దగలడన్న డౌట్లు వస్తున్నాయట. దానికితోడు సాహోను తెలుగుతోపాటు తమిళం.. మళయాళం.. హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. సుజిత్ కు మల్టీ లాంగ్వేజ్ సినిమా తీసిన ఎక్స్ప్ పీరియన్స్ కూడా లేదు. దీంతో... సుజిత్ పైనే హోప్స్ పెట్టుకుంటే రిజల్ట్ రావడం కష్టమే అని భావించి... ఫిలిం మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారట. వాళ్ల సూచన మేరకు హీరో ప్రభాస్... సినిమాటోగ్రాఫర్ మది షూటింగ్ స్పాట్ లో మరింత ఇన్వాల్వ్ అవుతున్నారట. అనుకున్న క్వాలిటీతో అవుట్ పుట్ వస్తోంది లేనిదీ తరచుగా చెక్ చేసుకుంటూ ముందుకెళుతున్నారని తెలుస్తోంది. మరి అన్ని అంచనాలు ఉన్నప్పుడు.. కావాల్సిన అవుట్ పుట్ రావాలన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు కదా..