English | Telugu

కృష్ణార్జున యుద్ధం టీజర్ రివ్యూ

on Mar 10, 2018

నాచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ 12 న విడుదలకి సిద్దమవుతుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఈ రోజు సినిమా టీజర్ రిలీజ్ చేసారు. పనీ పాటా లేని బేవార్స్ గా రాయలసీమ యాసతో అండ్ రాక్ స్టార్ గా అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేసే రిచ్ గయ్ గా- రెండు విభిన్న రోల్స్ లో కనిపించిన నాని, ఎంటెర్టైన్మెంట్ గ్యారంటీ అంటున్నాడు. టీజర్ చివర్లో వచ్చే రామాయణంలో రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ఎడిటర్ గౌతమ్ రాజు కూడా ఉంటారు... డైలాగ్ కడుపుబ్బా నవ్విస్తుంది. కిడ్నాప్ కామికల్ డ్రామా గా తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధంలో యాక్షన్ పాళ్లు కూడా ఎక్కువున్నట్టు కనిపిస్తుంది. మొదటి రెండు సినిమాలతో హిట్లు కొట్టిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ హీరోయిన్ కాగా, రుక్షర్ మీర్ రెండో హీరోయిన్ గా గ్లామరస్ పాత్రలో అలరించనుంది. ఒకే మూస సినిమాలు చేస్తున్నాడని విమర్శిస్తున్న వాళ్ళకి నాని కృష్ణార్జున యుద్ధం తో ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి!

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here