గుళ్లో తప్పు చేసి దొరికిపోయిన హీరోయిన్
on Mar 8, 2018
తెలుగు, హిందీ తో పాటు పలు భాషల్లో నటించి, తన అభినయం, గ్లామర్ తో ప్రేక్షకుల మది దోచుకున్న రవీనా టాండన్ ఈ మధ్య చాలా అరుదుగా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ వదిలేసి చాలా ఏళ్ళు గడిచినప్పటికీ, బాలీవుడ్ లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుంది. అయితే, ఈ మధ్య ఒక యాడ్ లో నటించి ఇబ్బందులు కొని తెచ్చుకుంది. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్ లోని లింగరాజ్ టెంపుల్ లో ఒక కమర్షియల్ షూట్ చేసారు. అందులో రవీనా టాండన్ సౌందర్య చిట్కాలు చెబుతూ కనిపిస్తుంది. ఇంతకీ, అందులో తప్పేముంది అంటారా? కెమెరాలు అనుమతించని ప్రదేశాల్లో కూడా ఈ యాడ్ ని షూట్ చేశారట. దీనితో కోపగించిన గుడి పెద్దలు, రవీనా మరియు యాడ్ యూనిట్ పైన కేసు రిజిస్టర్ చేశారట. భారత పురావస్తు శాఖ వారు కూడా ఈ విషయమై ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారట. అసలే, సినిమా ఆఫర్లు లేక తల పట్టుకుంటున్న రవీనకి ఈ కేసు ఇంకొన్ని తల నొప్పులు తెచ్చి పెడుతుంది.