English | Telugu

వెంకీ సినిమాపై బాల‌య్య ఫైర్‌!!

on Mar 7, 2018


బాల‌య్య ని చిన్న పిల్లాడితో పోలుస్తారంతా. భోళా మ‌నిషి అని.. అంద‌రితోనూ స‌ర‌దాగా ఉంటాడ‌ని చెబుతుంటారు. అయితే బాల‌య్య కి ఆగ్ర‌హం వ‌స్తే అలా ఇలా ఉండ‌దు. శివ‌తాండవం ఆడేస్తాడు. త‌న సింహావ‌తారం చూపించేస్తాడు. ప్ర‌స్తుతం ఓ ద‌ర్శ‌కుడిపై బాల‌య్య చిరుబురులాడుతున్నాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు. తేజ‌నే..

 

బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి గానూ తేజ‌ని ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నారు. బాల‌య్య‌తో సినిమా అంటే ప్ర‌తీ ద‌ర్శ‌కుడికీ ఓ స‌వాలే. బాల‌య్య‌తో హిట్టు కొడితే.. స్టార్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోవొచ్చు. తేజ ఆల్రెడీ స్టార్‌. కాక‌పోతే పెద్ద హీరోల‌తో ఎప్పుడూ సినిమా చేయ‌లేదు. అందుక‌నే.... ఇది త‌న‌కో సువ‌ర్ణావ‌కాశం. కానీ తేజ అలా అనుకోవ‌డం లేదు. బాల‌య్య ద‌గ్గ‌ర ఇమ‌డ‌లేనేమో అని కాస్త జంకుతున్నాడు. అందుకే బాల‌య్యతో సినిమా ఒప్పుకుని, వెంకీ తో మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించేశాడు. `ఒకేసారి రెండు సినిమాల‌పై దృష్టి ఎలా పెడ‌తావ్‌` అన్న‌ది బాల‌య్య ప్ర‌శ్న‌. దానికి తేజ ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. ఈ సంక్రాంతికి ఎలాగైనా స‌రే ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తీసుకురావాల‌న్న‌ది బాల‌య్య ఆలోచ‌న‌. తేజ ఏమో మ‌రో సినిమాతో బిజీ అయిపోయాడు. అందుకే బాల‌య్య‌కు కోపం వ‌చ్చేసింది. `నా అనుమ‌తి లేకుండా వెంక‌టేష్‌తో సినిమా ఎందుకు చేస్తావ్‌` అని తేజ‌ని నిల‌దీసిన‌ట్టు తెలుస్తోంది. ఓ ద‌శ‌లో తేజ ని తీసేసి మ‌రో ద‌ర్శ‌కుడ్ని పెట్టుకుందామ‌న్న ఆలోచ‌న కూడా వ‌చ్చింద‌ట‌. కానీ.. బాల‌య్యే కాస్త శాంతించి తేజ‌తో స‌ర్దుకుపోవాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. సినిమా మొద‌ల‌వ్వ‌క ముందే.. తేజ - బాల‌య్య మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. మును ముందు ఈ కాపురం ఎలా సాగుతుందో..??


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here