జనాలకు ఎన్టీయార్ తొలి నాయక అంటే ఆమే!
on Dec 12, 2017
అందంతో ప్రమేయం లేకుండా అద్భుతమైన నటనతో స్టార్ గా ఎదిగిన కథానాయికలు చాలా అరుదుగా ఉంటారు. వారిలో ముందు చెప్పుకోవాల్సిన నటి షావుకారు జానకి. తన తొలి సినిమా ‘షావుకారు’ పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న ఈ మహానటి తెలుగు తెరకు దక్కిన ఓ వజ్రం. అందులో నో డౌట్. నటనపై మక్కువతో చిన్న వయసులోనే ముఖానికి రంగేసుకున్నారు జానకి. ఆ తర్వాత అవకాశాలు పోటెత్తినా... చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. పెద్ద చదువే చరదివారు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయాలని ఎన్నడూ అనుకోలేదామె. ‘ఇది నేనే చేయాలి’ అనిపిస్తేనే చేశారు. తన చెల్లెలు కృష్ణకుమారి గ్లామర్ పాత్రలలో కూడా మెప్పిస్తుంటే... జానకి మాత్రం అందుకు భిన్నంగా నటనకు ప్రాధాన్యత ఉన్నపాత్రల్లోనే కనిపించేవారు. దక్షిణాది ప్రేక్షకులందర్నీ అలరించేవారు. ఎన్టీయార్ తో కెమెరాను షేర్ చేసుకున్న తొలి హీరోయిన్ అంజలి అయితే... తెరను షేర్ చేసుకున్న తొలి హీరోయిన్ జానకి. ఆ విధంగా ఎన్టీయార్ తొలి నాయిక అంటే జనాలకు జానకీనే. షావుకారు, ముందడుగు, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, అక్కచెళ్లెల్లు, సంసారం ఒక చదరంగం.. ఇలా ఆమె చేసిన పాత్రలన్నీ భిన్నమైన పాత్రలే. రీసెంట్ గా క్రిష్ ‘కంచె’లో కూడా అద్భుతమైన పాత్ర చేశారామె. నేడు ఆ మహానటి పుట్టిన రోజు 87వ పడిలోకి అడుగుపెట్టారామె. ఇంకా ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు ఆమె జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగువన్.