మళ్లీరావాపై మనసుపడిన ముఖ్యమంత్రి
on Dec 10, 2017
నిత్యం రాజకీయాలతో.. పరిపాలనా వ్యవహారాలతో బిజీ బిజీగా గడుపుతుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎప్పుడైనా వీలు కుదిరితే కుటుంబంతో గడుపుతూ కాస్త సేదతీరుతూ ఉంటారు గులాబీ బాస్. అలాంటి వ్యక్తి ఇప్పుడు సినిమా చూడాలనుకుంటున్నారట. హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు అక్కినేని హీరో సుమంత్. అయితే చాలా రోజుల తర్వాత ఆయన కోరిక నెరవేరింది. సుమంత్ హీరోగా నటించిన మళ్లీరావా మూవీకి మంచి టాక్ వచ్చింది.. చక్కని భావోద్వేగాలతో మంచి ఫీల్‌గుడ్ మూవీగా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలసి సినిమా చూడాలనుకున్న ముఖ్యమంత్రికి ఈ మూవీ అయితే బెటర్ అన్నారట అధికారులు. అంతే సీఎంవో నుంచి సుమంత్‌కు ఫోన్ వచ్చింది. కేసీఆర్ ఫ్యామిలీ కోసం వీకెండ్లో స్పెషల్ షో వేయ్యాలని చెప్పారట అధికారులు. దీంతో ఈ వార్త ఫిలింనగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఒక్కసారిగా మళ్లీరావాకి క్రేజ్ పెరిగిపోయిందని చిత్రయూనిట్ సంబరపడిపోతోందట.