రత్తాలు... కుమ్మేయ్!
on Nov 23, 2017
మెగాస్టార్ చిరంజీవి ఎవరిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించరు. ఆయన పనేంటో ఆయన చూసుకుంటాడు. అలాంటిది లక్ష్మీరాయ్ పై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించడం... బాలీవుడ్ లో తాను చేస్తున్న ‘జూలీ 2’ చిత్రానికి సంబంధింన వేడుకలో బెస్ట్ విషెస్ చెబుతూ స్వయంగా మెగాస్టారే ఓ వీడియో సందేవం పంపడం నిజంగా అందర్నీ ఆశ్చర్యానికి లోను చేస్తోంది. ‘లక్ష్మీరాయ్... నీ కెరీర్లో జూలీ 2 చాలా ముఖ్యమైన సినిమా అని తెలుసు. ఇది బాలీవుడ్లో నీ తొలి సినిమా. కెరీర్ పరంగా ఇది నీ యాభైవ సినిమా. ఈ సినిమా నీ కెరీర్లోనే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని మెగాస్టార్ పంపిన ఈ వీడియో మెసేజ్ బాలీవుడ్ లోనే పెద్ద సంచలనం అయ్యింది.
ఊహించని ఈ పరిణామానికి లక్ష్మీరాయ్ ఉబ్బి తబ్బిబ్బయ్యింది. వెంటనే ట్విట్టర్ లో ‘థ్యాక్స్ సార్.. థ్యాక్యూ సో మచ్. మీ ప్రతి అక్షరం నాకు ఆశీర్వాదమే. మీ నమ్మకాన్ని మీ రత్తలు నిలబెడుతుంది’ అని ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మీడియా సర్కిల్ లో చర్చనీయాంశమైంది. ఇదిలావుంటే... 14 ఏళ్ల క్రితం నేహా దుపీయా చేసి ‘జూలీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం అయ్యింది. దానికి సీక్వెల్ గా ఈ ‘జూలీ 2‘ను తెరకెక్కిస్తున్నారు. దీంట్లో ప్రధాన పాత్రను లక్ష్మీరాయ్ పోషిస్తుండటం విశేషం.