స్పైడర్’ కి సీన్ లేదంట... మహేశ్ నిజం చెప్పాడు!
on Sep 26, 2017
మహేశ్ బాబు సిస్టం ముందు కోర్చొని ఏదో పరిశోధనలో ఉంటాడు.. వెనుక నుంచి ఓ రోబో స్పైడర్ నడుచుకుంటూ వస్తుంది. మహేశ్ పై నుంచి పాకుతూ... భుజంపై చేరుతుంది. అప్పటిదాకా పనిలో నిమగ్నమైన మహేశ్... తన సైగలతో రోబో స్పైడర్ ని కంట్రోల్ చేస్తాడు. ‘స్పైడర్’ ప్రమోషన్లో ప్రథమంగా విడుదల చేసిన టీచర్ ఇది. ‘గ్లింప్స్ ఆఫ్ స్పైడర్’ పేరుతో విడుదలైన ఈ టీజర్ ని కోటి మందికి పైనే చూశారు. ఇది చూసిన వారందరూ ఈ సినిమాపై రకరకాల ఊహల్లో తేలియాడారు. ఇందేదో సెంటిఫిక్ థ్రిల్లర్ అయ్యుంటుందనే అభిప్రాయానికి కూడా వచ్చేశారు.
అయితే... మహేశ్ ఈ విషయంపై అసలు విషయాన్ని బయటపెట్టేశాడు. అసలు ఆ రోబో స్పైడరే సినిమాలో ఉండదట. సినిమా కాన్సెప్ట్ ని సూచాయగా తెలియజేయడానికే టీజర్ అలా సెట్ చేశామని మహేశ్ చెప్పేశాడు. సో... ‘స్పైడర్’లో రోబో స్పైడర్ ని ఎక్స్ పెక్ట్ చేయొద్దు.
అలాగే మహేశ్ ఇందులో ఐబీ అధికారిగా నటిస్తున్నాడూ, డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు అనే వార్తలు కూడా వెలుగు చూశాయ్. అలాంటిదేం లేదనీ.. అవన్నీ గాలి వార్తలే అని మహేశ్ కొట్టి పారేశాడు. సినిమా నేరపరిశోధన నేపథ్యంలోనే సాగుతుంది. విలన్ పాత్ర హీరో పాత్రను డామినేట్ చేసే స్థాయిలో ఉంటుంది. ఇందులో మహేశ్, ఎస్.జే. సూర్య మధ్య సాగే సన్నివేశాలు క్యాట్ అండ్ ర్యాట్ గేమ్ లా ఉంటాయని.... తెలుస్తోంది.
ఇప్పటివరకూ వినిపిస్తున్న సెన్సార్ రిపోర్ట్ బట్టి చూస్తే... సినిమా బావుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. మరి అందులో నిజం ఎంతుందో తెలుసుకోవాలంటే... ఇంక కొన్ని గంటలు ఆగాల్సిందే.