ENGLISH | TELUGU  

శివబాలాజీ గెలుపుకు కారణాలివేనా?

on Sep 25, 2017

ఎట్టకేలకు ‘బిగ్ బాస్’ విజేత ఎవరో తేలిపోయింది. నటుడు శివబాలాజీ ‘బిగ్ బాస్’ విన్నర్ గా నిలిచి యాభై లక్షల ఫ్రైజ్ మనీని తన్నుకుపోయాడు. నిజానికి ‘బిగ్ బాస్’ చివరి ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. చివరిగా మిగిలిన వారు గట్టి పాటిస్పెంట్స్ అవ్వడంతో... బుల్లితెర వీక్షకులు ‘గెలుపు ఎవరిదా!’ అని ఆసక్తిగా ఎదురు చూశారు. ముగ్గురికీ ఓట్లు కూడా.. చాలా తక్కువ తేడాతో రావడం విశేషం. ఏది ఏమైనా... విజేత మాత్రం ‘శివ బాలాజీ’

శివబాలాజీ గెలుపుపై ఎవరి అభిప్రాయాలు వారివి. ‘యతికల్ గా ఆలోచించి విజేతను ఎంపిక చేశారు’ అనేది ఎక్కువమంది వాదన. అసలు శివబాలాజీ గెలుపుకు కారణాలేంటి? అనే విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తే... కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూడక మానవ్. 

శివబాలాజీ.. ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంటరైన తొలి కంటెస్టంట్స్ లో ఒకడు. చివరిదాకా మిగిలిన అయిదుగురిలో ఒకడు. అంటే... అయిదుగురూ బాగా ఆడినట్టే లెక్క. కానీ విజేతగా శివబాలాజీ నిలవడానికి కారణాలు చాలానే ఉన్నాయ్. ఆ అయిదుగురిలో శివబాలాజీ కొన్ని విషయాల్లో ప్రత్యేకం. వాటిని పాయింట్ల వారీగా చెప్పుకుంటే... 

1. హౌజ్ లో చాలా సందర్భాల్లో  భావోద్వేగపూరిత వాతావరణాలు చోటు చేసుకున్నాయ్. కానీ... ఎప్పుడూ శివబాలాజీ.. తన సహనాన్ని కోల్పోలేదు. 

2. తన యాటిడ్యూడ్. సొంత ఇంట్లో ఎంత కేజువల్ గా ఉంటాడో అలాగే హౌజ్ లో కూడా మసలాడు. వంట పని విషయంలో ఎక్కువ బాధ్యత తనే మోశాడు. కానీ.. ఎప్పుడూ విసుక్కోలేదు. చీరాకు పడలేదు. ఓ విధంగా ఎంజాయ్ చేశాడు. 

3. ‘బిగ్ బాస్’ హౌజ్ లో సమీర్ తర్వాత వయసులో పెద్ద వాడు కూడా  శివబాలాజీనే. సమీర్ కొన్ని రోజులకే హౌజ్ ని వదిలి వెళ్లిపోయాడు. దాంతో హౌజ్ లో అందరికంటే పెద్దవాడు శివ.. అలాగే బిహేవ్ చేశాడు కూడా. తాను లీడర్ కాకపోయినా... ఓ పెద్ద దిక్కుగా నిలిచాడు. అయితే... అది కావాలని చేసింది కాదు. తనలో బేసిగ్గా ఉన్న లీడర్ షిప్ క్వాలిటీ అలా చేయించింది. అది కూడా చాలామందికి నచ్చింది. 

4. ఇది ముఖ్యమైన విషయం... ‘బిగ్ బాస్’ హౌజ్ లో చివరి వరకూ నెట్టుకొచ్చిన కంటెస్టంట్స్ లో పెద్ద కుటుంబం.. పరిపూర్ణమైన కుటుంబం.. శివబాలాజీదే. తాను ఇద్దరు బిడ్డల తండ్రి. భార్యా పిల్లల్ని వదిలి కూడా ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుడా.. బాధను దిగమింగుకొని  70 రోజులు ఓర్పుగా ఉన్నాడు. 

5. ‘బిగ్ బాస్’ హౌజ్ లోకి స్వప్నమాధురి వచ్చిన సంఘటన శివబాలాజీకి బాగా కలిసొచ్చింది. ఆ సంఘటన చాలామందిని కదిలించింది. చాలాకాలం తర్వాత భార్యను చూసి.. శివబాలాజీ స్పందించిన తీరు, స్వప్నమాధురి భావోద్వేగానికి లోనైన విధానం, తన పిల్లల లెటర్స్ చదువుతూ శివబాలాజీ కన్నీరు పెట్టుకున్న సందర్భం... వీటన్నింటికీ  ప్రేక్షకులు బౌల్డ్ అయిపోయారు. ఈ ప్రభావం చివరి ఓట్ల పై బలంగా ఉంది. 

6. ఆట బాగా ఆడాడు. చివరిదాకా నిలిచాడు. ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేశాడు. హౌజ్ కి నిండుతనాన్ని తెచ్చాడు. అంతేకాకుండా... ఇద్దరు బిడ్డల తండ్రి. 

నిజానికి బిగ్‌బాస్ హౌస్‌లో నవదీప్ తర్వాత కొంచెం పేరున్నవాడు..జనానికి చేరువైన వాడు..శివబాలాజీ. ఇది కూడా తను విన్నర్ అవ్వడానికి ఒక కారణం కావొచ్చు. ఎందుకంటే ఈ సెషన్‌లో ఏ మాత్రం జనాదరణ లేని వ్యక్తి విన్నరైతే, నెక్ట్స్ సెషన్‌లో సెలబ్రిటీలు బిగ్‌బాస్‌పై ఆసక్తి చూపించరేమో అనే భయం కూడా బిగ్‌బాస్ నిర్వాహకులకు కలిగి ఉండవచ్చు. ఇది కేవలం బిగ్‌బాస్ పాయింట్ ఆఫ్ యూ.

ఈ కారణాలన్నీ శివబాలాజీని విజేతగా నిలిపాయ్. ఓ విధంగా జనాన్ని సెంటిమెంట్ తో కొట్టాడన్నమాట. నిజానికి ఆదర్ష్ కూడా బాగా ఆడాడు. తనది కూడా చిన్న ఫ్యామిలి. అయితే... జనాన్ని ఎంటర్టైన్ చేసే విషయంలోనే కాదు.. చాలా విషయాల్లో శివబాలాజీ కంటే వెనకబడ్డాడు. జనాల తీర్పు ఎంత కరెక్ట్ ఉందో చెప్పడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే... చివరిగా వీళ్లిద్దరే మిగలడం. 

గెలవాలనే ఆశ ఉన్నా గెలుపుకోసం తాపత్రయపడ్డట్టు శివబాలాజీ కనిపించలేదు. మిగిలిన అందరిలో ఆ తాపత్రయం కనిపించింది. ముఖ్యంగా హరితేజ. తాను మరీ ఎక్కువ యాక్టీవ్ గా ప్రవర్తించడం కూడా జనానికి నచ్చినట్టు లేదు. 

ఏది ఏమైనా... ‘బిగ్ బాస్’ ఫస్ట్ సేషన్ విజేత ‘శివబాలాజీ’... కంగ్రాట్స్ బాలాజీ... కంగ్రాట్..


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.