ENGLISH | TELUGU  

రజనీకాంత్ ప్లేస్ కే ఎసరు పెడతాడట!

on Sep 24, 2017

దర్శకులను మాయ చేసేస్తాడు మహేశ్. ఆయనతో ఎవరు పనిచేసినా... తెగ పొగిడేస్తుంటారు. తాను ఎంత సూపర్ స్టార్ అయినా... సెట్ లో విద్యార్థిలా మారిపోతాడు. అందుకే దర్శకులకు మహేశ్ అంటే అంత గౌరవం. అలాగే...  మహేశ్ కూడా దర్శకుల పట్ల అదే గౌరవ భావంతో ఉంటాడు. ‘నా దర్శకులే నాకు దేవుళ్లు’ అని ‘స్పైడర్’ ఆడియో వేడుకలో చెప్పాడుగా. 
ఈ నెల 27న ‘స్పైడర్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మురగదాస్.. ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడారు. 

‘ఇప్పటివరకూ తెలుగులో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేశ్.. రేపు ‘స్పైడర్’ విడుదలవ్వగానే... సౌతిండియన్ సూపర్ స్టార్ గా అవతరిస్తారు’ అని భారీ స్టేట్మెంట్ ఇచ్చేసి.. అందరూ అవాక్కయ్యేలా చేశాడు మురగదాస్. తమిళ దర్శకుడయ్యుండి.. తెలుగు హీరోను ఇంతలా పొగడటం చాలామందికి ఆశ్చర్యాన్ని గురిచేసిందనే చెప్పాలి.  

మురగదాస్.. 2006లోనే ‘పోకిరి’ షూటింగ్ లో మహేశ్ ని కలిశాడట. అప్పటికి ‘తుపాకి’ కథ సగంలో ఉందట. అప్పుడే సినిమా చేద్దామని ఇద్దరూ అనుకున్నారట. ఆ సమయంలో ‘తుపాకి’ కథ పూర్తిగా ఉండి ఉంటే.. ఈ పాటికి ఈ కాంబినేషన్లో రెండుమూడు సినిమాలు వచ్చుండేవి. 

ఇక ‘స్పైడర్’ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు మురుగదాస్. ‘శక్తివంతమైన విలన్ తో హీరో పోరాటం మనం చాలా సినిమాల్లో చూశాం. కానీ ఈ సినిమాలో పోరాటం వెరైటీగా ఉంటుంది. కంటికి కనిపించని శత్రువుతో హీరో యుద్ధం చేస్తుంటాడు. రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని కళ్లు తిప్పుకోనీయదు ఈ సినిమా’ అన్నాడు మురగదాస్. 

మహేశ్ కేరక్టర్ తమిళ వెర్షన్ డబ్బింగ్ కోసం నలుగురైదుగుర్ని చూశారట. నచ్చకపోవడంతో మహేశ్ నే చెప్పమన్నాడట మురుగదాస్. దాదాపు 15 రోజులు తమిళ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పాడట మహేశ్. తెలుగు వెర్షన్ డబ్బింగ్ చెప్పడానికి మహేశ్ తీసుకునే సమయం 4 రోజులు. అలాంటిది తమిళ వెర్షన్ కోసం 15 రోజులు కష్టపడ్డాడు సూపర్ స్టార్. ఆ అంకితభావం చూసి మురుగదాస్ పొంగిపోయాడట. 

మీడియాతో చెబుతూ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. అభిరుచి గల ప్రతి దర్శకుడూ మహేశ్ తో ఒక్కసారైనా పని చేయాలనీ.. తాను పని చేసిన హీరోలందరిలో మహేశ్ ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు మురుగదాస్. 

‘స్పైడర్’ క్లైమాక్స్... సినిమాకే హైలెట్ అట. 500 మంది ఆర్టిస్టులతో 15 రోజులు చిత్రీకరించిన ఈ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయని మురుగదాస్ ఇంటర్నేషనల్ మీడియాతో చెప్పాడు. 

తెలుగు, తమిళ, మలయాళ, భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ‘స్పైడర్’... విజయాన్ని సాధిస్తే మాత్రం... ఆ వసూళ్లు చాలా ప్రమాదకరంగా ఉండటం ఖాయం. దాదాపు ఓ అయిదొందల కోట్లకే టార్గెట్ పెట్టారు ఈ దఫా సూపర్ స్టార్. మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో తెలుసుకోవాలంటే... 27 దాకా ఆగాల్సిందే. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.