శ్రీదేవిని పెట్టుంటే బాహుబలి పోయేది
on May 29, 2017
శివగామి క్యారెక్టర్ కి రాజమౌళి మొదట రమ్యకృష్ణనే అనుకున్నా, హిందీ మార్కెట్ తదితర అంశాలు దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకొని శ్రీదేవిని కలిసారంట. మరి ఇంతకీ నిన్నటి తరంలో బాలీవుడ్లో ఒక ఊపు ఊపిన శ్రీదేవిని కాదని రమ్యకృష్ణని తీసుకున్నారెందుకు అని చాలా మందికి సందేహం. దీనికి రాజమౌళి చెప్పిన సమాధానం... ఆయన శివగామి క్యారెక్టర్ విషయంలో తీసుకున్న నిర్ణయంతో మనల్ని ఏకీభవించేలా చేస్తుంది. కట్టప్ప రోల్ కి ఒకరిద్దరిని అనుకున్నా ఫస్ట్ నుండి సత్యరాజ్ అయితేనే బాగుంటుందని అనుకున్నాం అని, కానీ శివగామి క్యారెక్టర్ కి శ్రీదేవిని కలవడం జరిగిందని ఆమె డిమాండ్స్ కి భయపడి, మొదట అనుకున్న రమ్యకృష్ణకే ఫిక్స్ అయ్యామని చెప్పారు.
ఎనిమిది కోట్లు రెమ్యూనరేషన్, ప్రతి సారి 5 బిజినెస్ క్లాస్ టికెట్లు, స్టార్ హోటల్లో 5 సూట్లు ఇవి శ్రీదేవి రాజమౌళి ముందు పెట్టిన డిమాండ్స్. రాజమౌళి అండ్ టీం ఈ డిమాండ్లకు కూడా ఓకే చెబుతాం అనుకున్నంతలో హిందీలో షేర్ అడిగారట శ్రీదేవి. ఇంక తమ వాళ్ళ కాదని వదిలేశాం అని రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. శ్రీదేవిని పెట్టుంటే మొత్తం పోయేది అని అభిప్రాయపడ్డారు. మరి పోవేంటి... హీరో, డైరెక్టర్ లని మించి ఆవిడ ఒక్కరికే అంత డబ్బులు పోసేస్తే!
Also Read