కన్నడ భామపై కన్నేసిన బన్నీ..!
on May 23, 2017
వరస చిత్రాల విజయంతో రేసు మీదున్న టాలీవుడ్ స్టార్ గా ... తన నటన తో ...హుషారు పుట్టించే నృత్యాలతో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకొని.. మెగా స్టైలిష్ స్టార్ గా పేరొంది..ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ప్రస్తుతం హారీష్ శంకర్ దర్శకత్వం లో ‘డీజే' (దువ్వాడ జగన్నాథమ్) చిత్రం తో ముందుకు రానున్నారు.ఈ చిత్రానికి సంబధించిన పాటల సందడి మొదలైంది.ఒక్కొక్కపాటతో అలరించనున్నాడు.ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ చిత్రం తరువాత తన మరో కొత్త చిత్రం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.ఆయన వక్కంతం వంశీ చేయబోతున్న సినిమాలో కథానాయకుడిగా నటించనున్నారు .అయితే ఈ చిత్రబృందం కథానాయకి ఎంపికలో తలమునకలైనట్లు తెలుస్తుంది.తాజా సమాచారం మేరకు అయన సరసన కన్నడ భామ 'రష్మిక మందనా' ను తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో వినిపిస్తుంది.ఈ చిత్రం భారీ యాక్షన్ తో రానున్నది.వైవిధ్యమైన తీరుతో వక్కంతం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.డీజే చిత్రం విడుదల కాకముందే కొత్త చిత్రం సన్నాహాలు ఊపందుకున్నాయి.