దువ్వాడ జగన్నాథమ్ స్టోరీ ఏంటో తెలుసా??
on Feb 21, 2017
ఫస్ట్ లుక్ తోనే షాక్ ఇచ్చేశాడు దువ్వాడ జగన్నాథమ్. ఆ పాత్రలో బన్నీ లుక్ చూసి కేకలు పెట్టేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అల్లు అర్జున్ మేకోవర్ అదిరిపోయిందని కాంప్లిమెంట్లు ఇచ్చేన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డీజే లుక్తో అవి ఒక్కసారిగా రెట్టింపు అయిపోయాయి. ఇప్పుడు డీజే స్టోరీ కూడా లీకైపోయింది. ఎక్కడో పల్లెటూర్లో క్యాటరింగ్ నడుపుకొనే సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడు దువ్వాడ జగ్ననాథమ్. తను ఒట్టి అమాయకుడు, భయస్తుడు. కానీ ఊర్లో వాళ్లందరికీ తల్లో నాలికలా ఉంటాడు.
అయితే వారానికి ఓసారి సరుకుల కోసం పట్నం వెళ్లొస్తుంటాడు. పట్నం వెళ్లగానే తన గెటప్, సెటప్ అంతా మారిపోతుంటుంది. పల్లెటూర్లో దువ్వాడ జగన్నాథమ్గా ఉండేవాడు పట్నంలో అడుగుపెట్టేసరికి డిజేగా పేరు మార్చేసుకొంటాడు. అక్కడ డిస్కోలు, పబ్బులు అంటూ తనలో మరో కోణం చూపిస్తుంటాడు. అయితే అనుకోకుండా ఓ గ్యాంగ్ కన్ను డీజేపై పడుతుంది. ఎందుకు?? ఏమిటి?? అనేదే కథలో ట్విస్టు. ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాకీ డీజేకీ కథ విషయంలో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. కాకపోతే.. హరీష్ శంకర్ టేకింగు, బన్నీ యాక్టింగూ వేరే స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి డీజే కథలో కమర్షియల్ అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read