పవన్ కోసం పూజకి లుక్ టెస్ట్?
on Apr 10, 2021
తెలుగునాట అనతికాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇలా ఇప్పటికే పలువురు అగ్ర కథానాయకులతో ఆడిపాడిన పూజ.. త్వరలో `రాధేశ్యామ్` కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కనువిందు చేయనుంది. అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా కూడా పూజ కన్ఫామ్ అయినట్టే అని కథనాలు వస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. `గబ్బర్ సింగ్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత పవన్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం తాజాగా పూజకి లుక్ టెస్ట్ చేశారట. పవన్ జంటగా ఆమె లుక్ పర్ ఫెక్ట్ గా ఉండడంతో తననే కన్ఫామ్ చేశారని టాక్. త్వరలోనే పవన్, హరీశ్ కాంబో మూవీలో పూజా హెగ్డే ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, 2022 వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చే అవకాశముంది.