'సీటీమార్' టైటిల్ సాంగ్‌కు ఫస్ట్ విజిల్ వేసిన సమంత!
on Mar 3, 2021
గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తోన్న 'సీటీమార్' టైటిల్ సాంగ్ రిలీజైంది. తమన్నా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. టైటిల్ సాంగ్‌ను బుధవారం ఉదయం సమంత అక్కినేని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ చేశారు. దాంతో పాటు, "#SeetimaarrTitleSong Woo hoo.. first whistle for this awesome song.. wishing the team the very best." అంటూ ట్వీట్ చేశారు.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రేవంత్, వరం ఆలపించారు. ఈ పాటను కబడ్డీ కోచ్‌గా నటిస్తోన్న గోపీచంద్, ఆయన ట్రైనింగ్ ఇస్తున్న విమెన్ కబడ్డీ టీమ్‌పై చిత్రీకరించారు. పాట ప్రకారం పాపికొండల బ్యాక్‌డ్రాప్‌లో గోదావరి ఒడ్డుపై ఈ పాటను ఆకట్టుకొనేలా చిత్రీకరించారు. "కొట్టు కొట్టు ఈలే కొట్టు ప్రపంచమే వినేటట్టు.." అనే లైన్తోటే లక్ష్యసాధనవైపు తన కబడ్డీ ఆటగాళ్లను కోచ్ ఎలా ఉత్తేజితం చేస్తున్నాడో అర్థమవుతుంది.
మణిశర్మ బాణీలు మరోసారి ఆకట్టుకోగా, కాసర్ల శ్యామ్ ఇంప్రెసివ్ లైన్స్‌తో పాటను రాశారు. "సదా ధైర్యమే నీ ఊపిరైతే చిమ్మచీకటైన వెన్నెలేగా.." అనే లైన్లలో శ్యామ్ కలం పదును ఏమిటో తెలుస్తుంది. ఈ సాంగ్‌లో బాగా ఆకట్టుకుంది సౌందరరాజన్ కెమెరా ప్రతిభ. సూపర్బ్ విజువల్స్‌తో ఈ పాట చూడ ముచ్చటగా, ఉత్తేజభరితంగా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్‌ను కూడా ప్రస్తావించుకోవాల్సిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న సీటీమార్ థియేటర్లలో విడుదలవుతోంది.
గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్సర రాణి స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: సత్యనారాయణ డి.వై, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, రచన-దర్శకత్వం: సంపత్ నంది.
Also Read