అప్పుడు రజినీకాంత్.. ఇప్పుడు విజయ్..
on Feb 22, 2021
`మాస్టర్`తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు కోలీవుడ్ స్టార్ విజయ్. ఒకవైపు ఈ ఘనవిజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఓ స్టార్ హీరోయిన్.. విజయ్ కి జోడీగా నటించబోతోందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ భారీ బడ్జెట్ మూవీలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రతినాయకుడి పాత్రలో దర్శనమివ్వనున్నారని టాక్. ఆ నటుడు మరెవరో కాదు.. నవాజుద్ధీన్ సిద్ధిఖీ. హిందీనాట ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నవాజుద్ధీన్.. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన `పేట్ట` చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కట్ చేస్తే.. రెండేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు విజయ్ సినిమాలో నటించనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే `విజయ్ 65`లో నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.