`యన్టీఆర్ 30`కి హ్యాట్రిక్ సినిమాటోగ్రాఫర్?
on Feb 22, 2021
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చిన చిత్రం `క్రాక్`. నిజజీవిత ఘటనలతో రూపొందిన ఈ పవర్ ఫుల్ కాప్ డ్రామాకి హైలైట్స్ గా నిలిచిన అంశాలలో జి.కె. విష్ణు ఛాయాగ్రాహణం ఒకటి. ఈ సినిమా కంటే ముందు తమిళ చిత్రాలు `మెర్సల్`, `బిగిల్`కి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు విష్ణు. తెలుగులో `అదిరింది`, `విజిల్` పేర్లతో అనువాదమైన ఆ రెండు చిత్రాలు కూడా తమిళనాట వసూళ్ళ వర్షం కురిపించాయి. దీంతో.. హ్యాట్రిక్ సినిమాటోగ్రాఫర్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు జి.కె. విష్ణు.
కట్ చేస్తే.. ఇప్పుడీ టాలెంటెడ్ కెమెరామేన్ కి మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ఛాయాగ్రాహకుడిగా పనిచేసే అవకాశం దక్కిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `అరవింద సమేత` వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్ గా ఎంపికయ్యారని టాక్. త్వరలోనే `యన్టీఆర్ 30`లో జీకే విష్ణు ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
